- అస్సాంలో వరదల తీవ్రత
- లక్షలాది మంది ప్రభావితం
గౌహతి: అస్సాంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో వరదలతో మృతుల సంఖ్య 87కు చేరగా, లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 1.3 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. శివసాగర్, చరాయిడియో, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, బిశ్వనాథ్, కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాల్లోని 551 గ్రామాలు ఇంకా నీట మునిగిన పరిస్థితిలో ఉన్నాయి. అత్యధిక ప్రభావం చరాయిడియో జిల్లాలో నమోదైంది. ఈ జిల్లాలోనే 1,37,561 మంది వరదల కారణంగా ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సహాయక, పునరావాస చర్యలను అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల ప్రభావంతో జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా, ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.







కామెంట్‌లు (0)