ప్రజాశక్తి-యల్లనూరు : మండలంలోని వివిధ గ్రామాలలో సదరు వ్యక్తులతో రెవిన్యూ అధికారులు లాలూచి పడి గ్రామాలలోని గ్రామ కంఠం స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. గ్రామ కంఠం స్థలాలఫై రెవిన్యూ అధికారుల జోక్యం ఉండకూడదని గత నెల జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ యల్లనూరు పర్యటన లో వెల్లడించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ కంఠం కేవలం పంచాయతీ అభివృద్ధి అధికారితో పాటు పంచాయతీ సెక్రటరీ పర్యవేక్షణలో ఉండాలని వారు మాత్రమే గ్రామ కంఠ స్థలానికి సదరు గ్రామ వాసికి ఇళ్ళు లేకపోతే పట్టా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
గ్రామ కంఠ స్థలాలకు పట్టాలు
మండల వ్యాప్తంగా గ్రామ కంఠ స్థలాల్లో రెవిన్యూ అధికారులు జోక్యం చేసుకొని వివిధ గ్రామలలోని గ్రామ కంఠలకు పట్టాలు ఇచ్చారు.పట్టాలు పొందిన సదరు వ్యక్తులు పట్టాలఫై క్రయ, విక్రయాలు చేయరాదు. ఇన్ని నిబంధనలు వున్న గ్రామ కంఠ స్థలాలను కబ్జా చేశారని యల్లనూరు ప్రజా దర్బార్ కార్యక్రమం లో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సమక్షంలో కలెక్టర్ ఓ ఆనంద్ కు విలేకరులు వినతిపత్రం అందించడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకొని ఖాళీ చేయించాలని ఆదేశాలు ఇచ్చారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
జులై 19 న జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి యల్లనూరులో పర్యటించారు. అదే రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా యల్లనూరు స్థానిక కేంద్రం లో సర్వే నెం 408 ఇదే గ్రామానికి చెందిన సదరు వ్యక్తులు సుమారు 80 సెంట్ల మేర ఆక్రమించరని పిర్యాదు చేయడం. అందులో విలేకరులకు తలా 0.03 సెంట్లు కేటాయించారని కలెక్టర్ కు తెలపగ గ్రామ కంఠంలో ఎలా పట్టాలు ఇచ్చారని అధికారుల ప్రశ్నించారు. అందుకు అధికారులు మౌనం
వహించారు.వెంటనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు. ఇంతవరకు అక్కడ ఎటువంటి చర్యలు లేవు. అలాగే పెద్ద మల్లేపల్లి గ్రామం లోని సర్వే నెం 189 లో
18 సెంట్లు సదరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కి పట్టా ఇవ్వడంతో దాన్ని ఏకంగా సెంటు 62 వేలతో విక్రాయించాడు. ఇలాంటివి మండలంలో కోకొల్లలుగా చెప్పవచ్చు








కామెంట్‌లు (0)