ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుండెపోటుతో చౌడేపల్లె ప్రజాశక్తి విలేకరి రాజేష్ మృతి

15 సెప్టెంబర్, 2026

chittoor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పుంగనూరు (అన్నమయ్య జిల్లా) : అన్నమయ్య జిల్లా చౌడేపల్లి ప్రజాశక్తి విలేకరి రాజేష్ (43) మంగళవారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందారు. దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆయన టెంట్ హౌస్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా షుగర్‌, బిపి సమస్యతో బాధపడుతున్నారు. ఇంట్లో పడుకుని ఉండగా ఉన్నట్లుండి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే మృతి చెందారు. రాజేష్‌ తండ్రి ఇక్కలూరి కృష్ణయ్య మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. రాజేష్‌‌కు భార్య సంగీత, కుమార్తెలు సౌమ్య, భవ్య శ్రీ ఉన్నారు. రాజేష్‌‌ మృతి పట్ల ప్రజాశక్తి ఎడిటర్‌ ‌బి.తులసీదాస్‌, చీఫ్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌ అచ్యుతరావు సంతాపం తెలిపారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు, చౌడేపల్లి ప్రె‌స్‌క్లబ్ సభ్యులు, ప్రజాశక్తి సిబ్బంది నివాళులర్పించారు. రాజేష్ కుటుంబానికి ఎపిడబ్య్లుజెఎఫ్‌ సభ్యులు రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. చౌడేపల్లిలో సాయంత్రం రాజేష్‌ అంత్యక్రియలు ముగిశాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్