ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ

25 సెప్టెంబర్, 2026

Distribution of uniforms to Anganwadi workers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చిత్తూరు : అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమ దుస్తులు (యూనిఫాం) లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు పంపిణీ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ పరిధిలో 227 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జత యూనిఫామ్ అందించగా.. ఎమ్మెల్యే.. వాటిని అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని, అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, కాజూరు బాలాజీ, సీడీపీవో శ్యామ సుగుణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్