మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చెంచుగుడిలో కుక్కల దాడి.. ఆరు పొట్టేళ్లు మృతి

29 జులై, 2026

Dog attack in Chenchugudi... six rams dead.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మండలం, చెంచుగుడి గ్రామంలో వీధికుక్కలు రెచ్చిపోవడంతో తీవ్ర కలకలం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు మోహన్ రెడ్డి పెంచుకుంటున్న పొట్టేళ్లపై కుక్కల గుంపు దాడి చేసి ఆరు పొట్టేళ్లను చంపేశాయి. ఈ ఘటనతో పశుపోషకుడు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశాడు. గ్రామంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, పశువులతో పాటు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి, బాధిత రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్