ప్రజాశక్తి-పలమనేరు(చిత్తూరు) : ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 396కు వ్యతిరేకంగా పలమనేరులో దస్తావేజు లేఖరులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరిస్తూ, చివరకు దస్తావేజు లేఖరులను జీవనోపాధి లేకుండా చేసే పరిస్థితిని ప్రభుత్వం సృష్టిస్తోందని దస్తావేజు లేఖరుల సంఘం నాయకుడు పాతూరు జగ్జీవన్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 396 ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం దస్తావేజు లేఖరులు నిర్వహిస్తున్న డాక్యుమెంట్ల తయారీతో పాటు రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు సేవా కేంద్రాలకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం అమలైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరిన్ని అక్రమాలకు అవకాశం ఏర్పడటమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖరులు జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 20 నుంచి 31వ తేదీ వరకు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు పాతూరు జగ్జీవన్‌రావు తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై క్రయ, విక్రయదారుల్లో కూడా ఆందోళన నెలకొన్నట్లు పేర్కొన్నారు. సమ్మెకు మద్దతుగా దస్తావేజు లేఖరులు పోస్టర్లను విడుదల చేయడంతో పాటు సంబంధిత అధికారులకు వినతిపత్రాలను కూడా అందజేశారు.
దస్తావేజు లేఖరుల నిరవధిక సమ్మె
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)