ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇంచార్జిగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ ను నియమించినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వై. ఎస్. షర్మిళ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేసారు. శనివారం పోటుగారి భాస్కర్ చిన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ పై అభిమానంతో 1994 నుండి ఒక చిన్న కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్ గా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం వెదురుకుప్పం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, చిత్తూరు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, వెదురుకుప్పం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రెండు పర్యాయాలు, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పని చేసిన అనుభవం తో ఆయనను అనంతపురం జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గా నియమించడం పట్ల పలువురు నాయకులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. తన చిన్నతనం నుండే ప్రజాసేవ చేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన 2001-2006 వరకు పంచాయతీ ఉప సర్పంచ్ గా, 2021-2026 సం.వరకు తన సతీమణి పోటుగారి లలితా భాస్కర్ అత్యధిక మెజారిటీతో సర్పంచిగా గెలిచి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా భోణి కొట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. పోటుగారి భాస్కర్ నియామకం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేసారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజషన్ కందుకూరి హుమేష్, వెదురుకుప్పం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జయచంద్ర, నాయకులు దాసురెడ్డి, దావుద్,ప్రతాప్, తులసి మని, నిరంజన్, జ్యోతినాథ్, మునికృష్ణ, దినకర్ ప్రసాద్, గౌతమ్ తదితరులు వున్నారు.
అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా పోటుగారి భాస్కర్
03 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)