ప్రజాశక్తి గంగవరం/ వీకోట (చిత్తూరు) : నిజాలను నిర్భయంగా రాసే ప్రజా పక్షపాతిగా ఉంటూ.. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ప్రజాశక్తి దినపత్రిక అని వక్తలు ప్రశంసించారు. ప్రజాశక్తి పలమనేరు డివిజన్ 46 వార్షికోత్సవ సభ పలమనేరు పట్టణ సమీపంలోని గంగవరంలో గల ఎం.వి.ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ప్రజాశక్తి డెస్క్ ఇంచార్జ్ అవనిగడ్డ వనజ అధ్యక్షతన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ప్రజాశక్తి పత్రిక స్వతంత్ర ఉద్యమ కాలం 1942లోనే ప్రారంభమైందన్నారు. స్వతంత్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలంలోనే ఉద్యమ విశేషాలు ప్రజలకు చేరవేయడంతో పత్రిక ఎంతో కృషి చేసిందన్నారు. సమాజాన్ని మార్చే దిశలో పయనిస్తున్న పత్రికలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నారు. జర్నలిజంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు జర్నలిజం కాలేజిలో ఆరు నెలల కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. యువత సమాజానికి తాము ఏదైనా సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లాలని, సమాజానికి తాము ఏమి ఇచ్చామని ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎంచుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజాశక్తి పత్రిక వ్యవస్థాపకులు పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. వారి స్ఫూర్తితో ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను తట్టుకొని నిలిచిన ప్రజాశక్తి 46వ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రజాశక్తి పత్రికలు చదవడం అలవర్చుకుంటే అందులోని వ్యాసాలు ప్రపంచ విజ్ఞానాన్ని పెంచడంతోపాటు, సమాజాన్ని ఆకలింపు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులు యుగంధర్ మాట్లాడుతూ.. సంపన్న వర్గాల కబంధ హస్తాల్లో మీడియా నలిగిపోకూడదన్నారు. యువత సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని జన విజ్ఞాన వేదిక సభ్యులు గిరిధర్ మూర్తి పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు నిర్భయంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాశక్తి ఉందని పలమనేరు సిపిఎం నేత గిరిధర్ తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిష్పక్షపాతంగా పత్రికలు పనిచేయాలని గంగవరం డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. ప్రజాశక్తి కుటుంబ సభ్యులు, ముఖ్య అతిథులు, విద్యార్థుల నడుమ పలమనేర్ డివిజన్ 46వ వార్షికోత్సవ ప్రతులను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రసాద్, ప్రజాశక్తి బ్యూరో వలిగాలం గోపి, సర్కులేషన్ ఇంచార్జ్ శ్రీను, డివిజన్ ఇంచార్జ్ లు రామాంజనేయులు, దాము, విలేకరులు అశ్వత్ నారాయణ, సుబ్రమణ్యం, శివకుమార్ ,ప్రకాష్, త్యాగరాజులు పాల్గొన్నారు.
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర " ప్రజాశక్తి" : పలమనేరులోని 46వ వార్షికోత్సవ సభలో వక్తలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 03:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)