బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతుల దారికి గ్రహణం!

1 గంట క్రితం

road
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 11:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మురుగు నీరు.. పిచ్చిమొక్కలతో అవస్థలు

- పలుమార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు.. కలెక్టర్ స్పందించాలని రైతుల వేడుకోలు

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: మండలంలోని దేవదొడ్డి గ్రామంలో పొలాలకు వెళ్లే దారి అధ్వానంగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామం నుంచి 20కి పైగా కుటుంబాలకు చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఈ మార్గంపైనే ఆధారపడుతున్నారని, ప్రస్తుతం దారిలో డ్రైనేజీ మురుగు నీరు ప్రవహించడంతో నడిచేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో మార్గం పూర్తిగా ఇరుకుగా మారిందని, మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆవులు, ఇతర పశువులను పొలాల వద్దకు తీసుకెళ్లేందుకు కూడా నానా అవస్థలు పడాల్సి వస్తోందని తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాల్సిన రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, గ్రామస్తులు నిత్యం వినియోగించే దారిని పునరుద్ధరించి, మురుగు నీరు ప్రవహించకుండా కాలువ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టిసారించి దేవదొడ్డి గ్రామంలోని సమస్యాత్మక మార్గాన్ని పరిశీలించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని, పొలాలకు వెళ్లే దారిని పునరుద్ధరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్