ప్రభుత్వ కాలేజీలు విద్యాసంస్థలను బలోపేతం చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మసూద్ డిమాండ్
చిత్తూరు : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం గా గుర్తింపు పొందందని ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని ఆదివారం పలమనేరు సిఐటియు కార్యాలయంలో జరిగిన ఎస్ఎఫ్ఐ సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గం లోని ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న విద్యార్థుల, హాస్టల్లో ఉన్న మౌలిక సమస్యలపై అధికార యంత్రంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐగా పోరాడుతున్నామని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ సంస్థల్లో హాస్టల్స్ లో చదువుకుంటున్నారని వారిని నిర్లక్ష్యం చేయడం తగదని తెలిపారు. ప్రభుత్వం ప్రవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేస్తామని మాటలకే పరిమితమవుతున్నదని ఆచరణలో ప్రైవేటీకరణ దిశగా చర్యలు తీసుకుంటున్నదని విమర్శించారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ బలోపేతం చేయడం వలన విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు
ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక
ఎస్ఎఫ్ఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి మసూద్ ఆధ్వర్యంలో పలమనేరు మండలంలో నూతన కన్విన్ కమిటీ ఏర్పడింది. ఇందులో పలమనేరు ఎస్ఎఫ్ఐ కన్వీనర్ గా సమీర్ కో-కన్వీనయర్ గా తహీర్ కమిటీ సభ్యులు లా పునీత్, గౌతమ్, జుబెర్ ని ఎన్నికోవడం జరిగింది.







కామెంట్‌లు (0)