శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభించిన టిడిపి నాయకులు

1 గంట క్రితం

వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభించిన టిడిపి నాయకులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మండలం పేరుమాళ్ళుపల్లిలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా.వి.ఎం థామస్ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారి వనిత ఆధ్వర్యంలో వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. శనివారం మండల టిడిపి నేత, పెరుమాళ్ళిపల్లి మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి, చేతులు మీదుగా, టిడిపి శ్రేణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలను రైతులకు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ బోడిరెడ్డి.సుధాకర్ రెడ్డి, పార్లమెంట్ కార్యనిర్వక కార్యదర్శి చెంగల్రాయిరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ 40 శాతం రాయితీ ద్వారా రైతులకు అందజేస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్ రమణారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు బోడిరెడ్డి.రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నీటి సంఘం అధ్యక్షులు బోడి రెడ్డి.ఈశ్వర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ వరప్రసాద్ ఏఎంసీ డైరెక్టర్ బాలాజీ రెడ్డి బూత్ కన్వీనర్ శ్రీనివాసులు, బాబు, పంచాయతీ కార్యదర్శి ధనంజీయరేడ్డి, వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామ వ్యవసాయ సహాయకులు గ్రామ పట్టు శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్