మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కిక్కిరిసిన బాట గంగమ్మ ఆలయ ప్రాంగణం

5 రోజుల క్రితం

nss
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 06:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : ఆషాఢ మాస అమావాస్యను పురస్కరించుకుని బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని గ్రామదేవత శ్రీ బాట గంగమ్మ ఆలయ ప్రాంగణం బుధవారం భక్తజనంతో కిక్కిరిసింది. బుధవారం నుంచే పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివచ్చి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అమావాస్య సందర్భంగా ఆలయానికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు అఘోరా వేషధారణలు, వివిధ నృత్య ప్రదర్శనలతో యాత్రికులను విశేషంగా ఆకట్టుకున్నారు. డప్పులు, బ్యాండ్ మేళాలు, కళాకారుల నృత్యాలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు సైతం కళాకారుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహతి ఫౌండేషన్ చైర్మన్ నాగరాజు సహకారంతో యాత్రికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదానం అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రికులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అఘోరా వేషధారణలు, నృత్య ప్రదర్శనలు, బ్యాండ్ మేళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో పాటు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్