- విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం, గంటవారిపల్లి పంచాయితీ, అగ్గి చేనుపల్లి క్రాస్ దగ్గర సిరిపురం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థానికులు పూనుకొన్నారు. శాస్త్రక్తంగా క్రతువు నిర్వహించి సగం పనులు పైగా పూర్తి చేశారు. స్వామివారి విగ్రహం సుదూర ప్రాంతాల నుంచి తెప్పించుకుని. నేలన ఉన్న నీటి తొట్టిలో ఉంచారు. అసలు సమస్య అప్పుడే మొదలైంది. కూలీలు పక్క రాష్ట్రం నుంచి వచ్చారు పనులు మొదలుపెట్టారు.విద్యుత్ శాఖ అధికారులకు ఆ గుడికి కరెంట్ సౌకర్యం కల్పించడంలో విఫలమయ్యారు. కావాలని ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం కనిపించలేదు. కరెంటు సౌకర్యం లేక, నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని స్థానికులు చెబుతున్నారు. లక్షల్లో ఖర్చుపెట్టి ఆలయ నిర్మాణం చేపట్టిన... కరెంట్ సౌకర్యం లేక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారు నేల తొట్టిలోనే పూజలు లేక ప్రతిష్టించేదానికి కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అని వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.







కామెంట్‌లు (0)