సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం

14 సెప్టెంబర్, 2026

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 05:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం: చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలం ఉడమలకుర్తి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్ముగం అనే వ్యక్తికి చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులతో పాటు పైపులు, బోరు మోటార్ తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆర్ముగం తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్