శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పలమనేరులో "వి కేర్ ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ " అత్యుత్తమ ఫలితాలు

3 రోజుల క్రితం

palamaneru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 03:04 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఐవిఎఫ్ లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ఏకైక ఐవీఎఫ్ సెంటర్ "వి కేర్ ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ". పలమనేరు పట్టణంలో వి కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐవీఎఫ్ సెంటర్ స్థాపించిన మొదటి సంవత్సరం నుండే పిల్లలు లేని దంపతులకు పిల్లలు కలిగే విధంగా ప్రత్యేక కృషి ఫలితంగా, మంచి ఫలితాలు అందించి వారి మన్ననలు పొందుతున్నారు. అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవ సందర్భంగా స్త్రీల వైద్యులు గైనకాలజిస్ట్ డాక్టర్ అంజుమున్నేశా, ఇ ఎన్ టి స్పెషలిస్ట్ డాక్టర్ ఖలీలుల్లా ల కు ప్రత్యేక డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వారి జీవిత ప్రతిభ విశేషాలు


సత్ఫలితాల సంతాన సాఫల్య కేంద్రం 'వి కేర్' మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ....

పలమనేరు రంగబాబు సర్కిల్ వద్ద వున్న వి కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంచలంచలుగా సత్ఫలితాలతో అభివృద్ధి చెంది అందరి మన్ననలు పొందుతున్న సందర్భంగా ఎన్నో ఏళ్లుగా సంతానం లేక సంతానం పొందిన ఓ దంపతులు పలమనేరు వి కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఖలీలుల్లా మాట్లాడుతూ పలమనేరులో పుట్టి పెరిగి పలమనేరులోనే చదివిన ప్రముఖ ఈఎన్టి స్పెషలిస్టు డాక్టర్ ఖలీలుల్లా తన జన్మభూమికి తన చేతనైన సేవ, సహాయం చేయాలనే సదుద్దేశంతో బయట ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినా, వాటికి వెళ్లక పలమనేరులోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సదుద్దేశంతో 2014వ సంవత్సరంలో అద్దె భవనంలో ఐదు పడకలతో వీ కేర్ ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. అతి తక్కువ సమయంలోనే ప్రజల నుంచి మన్ననలు పొందామని, అతనే కాకుండా తన భార్య ప్రముఖ స్త్రీల వైద్యులు గైనకాలజిస్టు డాక్టర్ అంజుమునిషా కూడా అతి తక్కువ సమయంలోనే స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు మెరుగైన సేవలందిస్తూ ప్రజల నుండి మెరుగైన మన్ననలు పొందారన్నారు.


ఐవిఎఫ్ సెంటర్ స్థాపించిన మొదటి ఏడాదిలోనే అధిక శాతం ఫలితాలు వచ్చినందుకు దంపతుల హర్షం వ్యక్తం చేశారు. ఐవిఎఫ్ ద్వారా జన్మించిన బిడ్డను దంపతులకు అప్పగిస్తున్న డాక్టర్లు. తర్వాత 2020 లో సొంత భవనంలో ఆధునాతనమైన వసతులతో, అత్యాధునిక పరికరాలతో, చెవి, ముక్కు, గొంతు, స్త్రీల గర్భ సమస్యలు, సంతాన సమస్యలు మంచి అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందిస్తున్నామని తెలిపారు. 2024 సంవత్సరంలో పలమనేరులో మొట్టమొదట అత్యాధునిక ప్రయోగశాల, కంప్యూటరైజుడ్ ఆపరేషన్ థియేటర్, విలువైన పరికరాలతో సంతాన సాఫల్య కేంద్రం ఐవిఎఫ్ సెంటర్ ప్రారంభించామని తెలిపారు. పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలుగా పిల్లలు లేకుండా బాధపడి, చివరకు పలమనేరులోని వి కేర్ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా ట్రీటెమెంటు తీసుకొని మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ఒక బిడ్డకు జన్మనిచ్చిన రజనీ, నాగరాజు దంపతులు వి కేర్ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు ముందు వారు బెంగుళూరులో ఐవీఎఫ్ సెంటర్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయిందని తెలిపారు. డాక్టర్ ఎస్. అంజుమునిషా ప్రస్తుత అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పుట్టి పెరిగి తన విద్య అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు ఒక నిరుపేద కార్పెంటర్ కలలు సహకారం చేశారు . నిరుపేద కుటుంబం నుంచి కష్టపడి చదివి పట్టుదలతో డాక్టర్ పట్టా సాధించి తన సంకల్పం నెరవేర్చుకున్న డాక్టర్ అంజుమున్నేశా డాక్టర్ అంజుమునిషా మదనపల్లి పట్టణంలో ఒక నిరుపేద కష్టజీవి కార్పెంటర్గా పనిచేసే ముబారక్ కుమార్తె ఆమె విద్య కోసం పూర్తిగా మదనపల్లిలోనే మెరిటు స్టూడెంట్ గా డిస్టిక్ టాపర్గా నిలిచారు. తన కూతుర్ని ఎలాగైనా డాక్టర్లు చేయాలని పట్టుదలతో కార్పెంటర్ పనిచేస్తూ ఆమెను కష్టపడి చదివించాడు 7వ తరగతిలో డిస్టిక్ టాపర్గా పదవ తరగతిలో స్టేట్ టాపర్గా ఇంటర్మీడియట్లో ప్రతిభ అవార్డు విజేతగా నిలిచారు ఎంబిబిఎస్ కోర్సును కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. తన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రసిద్ధి చెందిన చండీగర్ పిజిఐఎంఈఆర్ కళాశాలలో పూర్తి చేశారు. పలమనేరులో ఇఎన్ టి స్పెషలిస్ట్ డాక్టర్ ఖలీల్ ఉన్నాను వివాహం చేసుకొని ప్రస్తుతం పలమనేరులో స్థిరపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వెళ్లక డా , అంజుమునిషా, డా. ఖలీల్ దంపతులు "వి కేర్ మల్టీస్పెషల్టి హాస్పిటల్" ను పలమనేరులో ప్రారంభించి గ్రామీణ సెమీ అర్బన్ ప్రజలకు అందుబాటులో విశేషంగా సేవలందిస్తున్నారు. పలమనేరు పట్టణంలో ఐవీఎఫ్ సెంటర్ మరియు లాప్రోస్కోపిక్ సస్ర చికిత్సలు చేస్తున్న ఏకైక హాస్పిటల్ గా వికేర్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ నిలిచినది. ఐవిఎఫ్ సెంటర్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే నూటికి నూరు శాతం ఫలితాలు సాధిస్తూ పిల్లలు లేక బాధపడుతున్న ఎంతోమంది దంపతుల మన్ననలు పొందుతున్నారు. ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి పలమనేరు నియోజకవర్గంలోనే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవ చేస్తున్నడం తనకెంతో తృప్తినిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్