సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..

1 గంట క్రితం

ycp ctr.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పోలీసుల అడ్డంకులు.. నాయకుల అరెస్ట్

ప్రజాశక్తి-చిత్తూరు: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసిపి నాయకులు సోమవారం భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో గంగినేని చెరువు వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించేందుకు నాయకులు సిద్ధమయ్యారు. అయితే నిరసన ప్రారంభానికి ముందే పోలీసులు భారీగా మోహరించారు. డీఎస్పీ నారాయణ బెస్ట్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, వన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. నిరసన ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు వైసీపీ నాయకులకు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో వైసీపీ నాయకులు పోలీసులను సంప్రదించి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేయడంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విజయానంద రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

విజయానంద రెడ్డి, ఇతర నాయకుల అరెస్ట్ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్