సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అన్నా క్యాంటీన్లో ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి

17 గంటల క్రితం

anna canteen.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మెప్మా డిస్ట్రిక్ రీసోర్స్ పర్సన్ పొన్నల దినకర్

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : అన్న క్యాంటీన్ పరిసరాలు నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ.. ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించాలని మెప్మా డిస్ట్రిక్ రీసోర్స్ పర్సన్, ట్రైనర్ పొన్నల దినకర్ సూచించారు. సోమవారం క్వారీ మార్కెట్ సెంటర్లోని అన్నా క్యాంటీన్‌లో అడ్వైజరీ కమిటీ సమక్షంలో నిర్వాహకులు, సిబ్బందికి ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత, క్యాంటీన్ పరిసరాలలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణపై పలు సూచనలను చేశారు. లబ్ధిదారులకు వసతుల కల్పనలో ఎటువంటి లోపం లేకుండా చూడాలని పేర్కొన్నారు. భోజనశాల, వడ్డించు ప్రదేశం, క్యాంటీన్ ఆవరణ నిరంతరం శుభ్రపరుస్తూ ఆహ్లాదకర వాతావరణం అందించాలన్నారు. ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. క్యాంటీన్ నిర్వహణను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మదర్షా అలీ, సీఎంఎం రామలక్ష్మి, అడ్వైజరీ కమిటీ సభ్యులు, క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్