ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల నిర్వహించిన క్రీడా పోటీలలో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (ఎ) విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ నెల ఆగస్టు 2వ తేదీన తూర్పు గోదావరి అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీలు మరియు ఎంపికలు ఆదివారం ఆర్ట్స్ కళాశాల అథ్లెటిక్స్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు జిల్లా స్థాయి ఎంపికలలో విజయం సాధించి త్వరలో తిరుపతిలో ఆగస్టు 11, 12, 13 తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. మా కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభతో పతకాలను సాధించారు. రెండవ సంవత్సరం బి.ఎస్.సి చదువుతున్న పి.రామ్ చరణ్ 100 మీటర్ల పరుగులో మూడవ స్థానం కాంస్య పతకం, 400 మీటర్ల పరుగులో రెండవ స్థానం రజత పతకం, పొడవు దూకుడులో రెండవ స్థానం రజత పతకం సాధించాడు. రెండవ సంవత్సరం బి.ఎస్.సి (ఆర్.ఇ.ఎం) విద్యార్థి కొమ్ము కార్తిక్ 800 మీటర్ల పరుగులో మూడవ స్థానం కాంస్య పతకం, 1500 మీటర్ల పరుగులో రెండవ స్థానం రజత పతకం గెలుచుకున్నాడు. రెండవ సంవత్సరం బి.ఎస్.సి విద్యార్థి పి.దుర్గ శ్రీనివాస్ 200 మీటర్ల పరుగులో మూడవ స్థానం కాంస్య పతకం, ఎత్తు దూకుడులో మొదటి స్థానం స్వర్ణ పతకం సాధించాడు. రెండవ సంవత్సరం బి.ఎస్.సి భూగోళశాస్త్రం చదువుతున్న పసుపురెడ్డి శ్రీనివాసు గోళా విసరడంలో మొదటి స్థానం స్వర్ణ పతకం సాధించగా, మూడవ సంవత్సరం బి.ఎ విద్యార్థి ఒంబోలు సాయి 200 మీటర్ల పరుగులో రెండవ స్థానం రజత పతకం, పొడవు దూకుడులో మూడవ స్థానం కాంస్య పతకం సాధించారు. మొత్తం మీద మా కళాశాల విద్యార్థులు స్వర్ణ, రజత మరియు కాంస్య పతకాలను సాధించి కళాశాలకు కీర్తి తీసుకువచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ చంద్ర ఆర్.కె, విద్యార్థుల ప్రతిభను, పట్టుదలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడా విభాగ అధిపతి డాక్టర్ కెప్టెన్ జి.ప్రమీల రాణి, శారీరక విద్య ఉపన్యాసకులు పి.వి.వి. లక్ష్మి, టి.విజయ దుర్గ, క్రీడా కమిటీ సభ్యులు, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీలకు ఆర్ట్స్ కళాశాల విద్యార్ధులు
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 04:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)