ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : ప్రభుత్వ స్వయంప్రతిపత్త కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకురాలు పిన్నింటి సురేఖ ముంబైలోని ప్రముఖ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ - హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వారం రోజుల NIUS - కెమిస్ట్రీ ఫ్యాకల్టీ టీచర్స్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారని ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్.కె. తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ జాతీయ శిక్షణకు 36 మందిని ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. అందులో ప్రభుత్వ కళాశాలకు చెందిన సురేఖ ఉండటం అభినందనీయమని ప్రిన్సిపాల్ కొనియాడారు. ఈ శిక్షణలో ప్రయోగాత్మక బోధనా పద్ధతులు, క్రిటికల్ థింకింగ్, సమస్యా పరిష్కారం, ప్రశ్న తయారీ, కెమిస్ట్రీ విద్యా సాహిత్యం, AIని నైతికంగా వినియోగించడం, ప్రయోగాత్మక, సైద్ధాంతిక అంశాలలో సందర్భోచిత బోధన వంటి అంశాలపై లోతైన చర్చలు, ప్రత్యక్ష ప్రయోగాలతో కూడిన శిక్షణ ఇచ్చారు. HBCSE-TIFR సంస్థ వసతి, భోజన సౌకర్యాలు కల్పించింది. శిక్షణలో పొందిన నూతన బోధనా విధానాలను విద్యార్థులకు అందించి వారిలో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందిస్తానని సురేఖ తెలిపారు. ఈ శిక్షణకు అకడమిక్ కోఆర్డినేటర్ ఇంద్రాణి దాస్ సేన్, జాతీయ కోఆర్డినేటర్ అర్నబ్ భట్టాచార్య సర్టిఫికెట్లను అందజేశారు. రసాయన శాస్త్ర విభాగం నుంచి అధ్యాపకురాలు ఎంపిక కావడం అభినందనీయమని వైస్ ప్రిన్సిపాల్ ఎం. వసంత లక్ష్మి, విభాగాధిపతి టి. శ్రీనివాసరావు తెలిపారు. అధ్యాపకులు జె. సురేష్, బి. వెంకట్రావు, అకడమిక్ కోఆర్డినేటర్ ఎ. రాజేశ్వరి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎ. అన్నపూర్ణ తదితరులు అభినందనలు తెలిపారు.
జాతీయ శిక్షణ పూర్తి చేసిన ఆర్ట్స్ కళాశాల అధ్యాపకురాలు
30 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 12:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)