మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నషాముక్త భారత్ అభియాన్" పై అవగాహన కార్యక్రమం

1 గంట క్రితం

eg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : స్థానిక ప్రభుత్వ ఆటానమస్ కళాశాల, రాజమహేంద్రవరం నందు కళాశాల ఈగల్ కమిటీ మరియు NCC, NSS, యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో "నషాముక్త భారత్ అభియాన్" పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ రహిత భారతదేశం కోసం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు సులభంగా డ్రగ్స్‌కు ఆకర్షితులై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. 10 కోట్ల డ్రగ్స్ రహిత భారతీయుల ప్రతిజ్ఞ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు డ్రగ్స్ వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలపై రాజమహేంద్రవరం బ్రహ్మకుమారికి చెందిన హేమ, మౌనికలు అవగాహన కల్పించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం. వసంతలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ వాడకం తగ్గించాలని సూచించారు. విద్యార్థులు నషాముక్త భారత్ అభియాన్ పోర్టల్‌లోకి వెళ్లి ప్రతిజ్ఞ చేసి సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి డా. జే. సురేష్, EAGLE కమిటీ కోఆర్డినేటర్, డా. ఎం. పద్మజ, అసిస్టెంట్ కోఆర్డినేటర్, జి. రవితేజ, YRC కోఆర్డినేటర్, డా. పి. సురేఖ, NSS కోఆర్డినేటర్, బి. సుజాత, కె. సుభాషిని, గోపాలకృష్ణ, ఆనంద్, NSS ప్రోగ్రాం ఆఫీసర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్