ప్రజాశక్తి–చాగల్లు: తిరుపతిలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–19 జూడో పోటీల్లో చాగల్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థి బి. చంద్రారావు కాంస్య పతకం సాధించాడు. ఈ విషయాన్ని పాఠశాల పీడీ విజయలక్ష్మి తెలిపారు. చాగల్లు నుంచి తొలిసారిగా జూడోలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకం సాధించడం గర్వకారణమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కాంస్య పతకం సాధించిన చంద్రారావును పాఠశాల హెచ్‌ఎం వాసవి, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.
రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో చాగల్లు విద్యార్థికి కాంస్యం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 21, 2026, 08:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)