సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు : కమిషనర్ రాహుల్ మీనా

3 రోజుల క్రితం

Construction without compromising on quality: Commissioner Rahul Meena
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : నాణ్యతలో రాజీ పడకుండా నగరంలో తలపెట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. గాంధీపురం - 4 రెవిన్యూ కాలనీలో రూ. కోటి 60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతను పరిశీలించి.. సంతృప్తి వ్యక్తం చేశారు. చేసిన పనులకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అలాగే 50 వ డివిజన్ భాస్కర్ నగర్లో 400 మీటర్ల బీటీ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చేందుకు ఇంజనీరింగ్ అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించారు. అనంతరం SKVT కళాశాల ప్రాంగణం నందు కాలువలపై రూ. 65 లక్షలతో ఏర్పాటు చేసిన జిఐ (గాల్వనైజ్డ్ ఐరన్) షీట్లను పరిశీలించారు. కాలువలో చెత్త పడకుండా ఇవి ఆపటంతో పాటు దుర్వాసన రాకుండా చేయటం, దోమల బెడదను తగ్గిస్తాయన్నారు. నగర ప్రజల అవసరాల దృష్ట్యా ప్రతి కాలనీలోనూ మురుగునీటి పారుదల వ్యవస్థ, సౌకర్యవంతమైన రహదారులు, పుష్కలమైన తాగునీరు, మెరుగైన విద్యుత్‌ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నగరపాలక సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేశారు. పర్యటనలో ఎస్ఈ రీటా, ఈఈ మదర్షా అలీ, ఎంహెచ్ఓ వినూత్న, డీఈ సత్యనారాయణ, ఏఈలు రమేష్, సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్