బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డివైడర్లు పచ్చదనంతో కళకళలాడాలి

13 ఆగస్టు, 2026

east
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కమిషనర్ రాహుల్ మీనా

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : నగర సుందరీకరణలో భాగంగా డివైడర్లు పచ్చదనంతో కళకళలాడాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎయిర్ పోర్టు రోడ్డులోని డివైడర్ల మధ్యలో నూతనంగా ఏర్పాటు చేసిన మొక్కలను పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని.. ఆవులు, గేదెలు, మేకలు మొక్కలను తినకుండా ఉండేందుకు వాటి చుట్టూ అవసరమైన ట్రీ గార్డులను సైతం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మొక్కలను సంరక్షించే బాధ్యతను ప్రజలు తీసుకున్నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం 2వ డివిజన్ ఏవీఏ రోడ్డులో రూ.25 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తి చేసిన డ్రెయిన్ నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఏడీహెచ్ అనిత, ఏఈ సత్యనారాయణ ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్