బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మీడియా స్వేచ్ఛపై పోలీసుల దాడి

16 సెప్టెంబర్, 2026

kerala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 12:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ

తిరువనంతపురం: మీడియా స్వేచ్ఛపై యుడిఎఫ్‌ ‌దాడి చేస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సిపిఎం ) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ ‌మీడియాలో బుధవారం పోస్టు పెట్టారు. రిపోర్టర్ టీవీ కార్యాలయంపై పోలీసుల దాడి మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిగా బేబీ పేర్కొన్నారు. కొంతమంది పోలీసు అధికారులు రిపోర్టర్ టివి కార్యాలయంలోకి ప్రవేశించి అసాధారణ రీతిలో వ్యవహరించారన్నారు. దీంతో కార్యాలయంలో భయాందోళన వాతావరణం నెలకొని, ఛానల్ ప్రసారాలు సుమారు గంటపాటు నిలిచిపోయాయన్నారు. మీడియా సిబ్బంది ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి మీడియాను నిశ్శబ్దం చేసిన సందర్భాన్ని ఎంఎ బేబీ ప్రస్తావించారు. అయితే అప్పట్లో మీడియా సంస్థల్లోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించడం, హింసకు పాల్పడటం వంటి ఘటనలు వినలేదన్నారు. గతంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీడియా వన్ ఛానల్ ప్రసారాలను నిలిపివేసినప్పుడు దానికి వ్యతిరేకంగా అందరూ ఏకతాటిపై నిలిచారని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్య సమాజంలో మీడియా స్వేచ్ఛ అంతర్భాగమన్నారు. విడి సతీశన్ ప్రభుత్వం మీడియాపై దాడులు, బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్