బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డిఎంఅండ్ హెచ్ఒగా డాక్టర్ కోమలి బాధ్యతల స్వీకరణ

1 గంట క్రితం

dm&ho
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 05:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : కాకినాడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సి.ఎస్ఆర్.ఎం.ఒ.గా సుదీర్ఘ కాలం సేవలందించిన డాక్టర్ కోమలి తూర్పు గోదావరి జిల్లా డి.ఎంఅండ్ హెచ్.గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని డాక్టర్ కోమలి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత పరిష్కారం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సమర్థవంతమైన అమలు లక్ష్యాలుగా పనిచేయనున్నట్లు తెలిపారు.

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ సర్జన్‌గా పనిచేసిన సమయంలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో,ఆసుపత్రి నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ఆమెకు ఉన్న అనుభవం జిల్లా స్థాయిలో వైద్య సేవలకు ఎంతో ఉపయోగపడుతుందని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని డాక్టర్ కోమలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్