బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ సంతాపం

2 గంటల క్రితం

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర

ప్రజాశక్తి-కాకినాడ : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ రాజకీయ వేత్త ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా, రాష్ట్ర మంత్రి గా ముద్రగడ పద్మనాభం తనదైన ప్రత్యేక శైలిలో పని చేసారన్నారు. వివిధ సందర్భాలలో ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేసారని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం తో పాటు అధికార పార్టీ పెద్దలను కూడా కదిలించగలిగే ప్రజా మద్దతు ఉన్న నాయకుడు ముద్రగడ అని తెలిపారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్