బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ICC: టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో మార్పులు..

1 గంట క్రితం

ICC-3
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 07:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

 క్రికెట్ టోర్నమెంట్ల నిర్వహణలో ఐసీసీ తీసుకురానున్న కొత్త ఫార్మాట్లు క్రీడా వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ప్రధానంగా 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్‌ల నిర్వహణ తీరును మార్చడం ద్వారా టోర్నీలను మరింత రసవత్తరంగా మార్చనుంది.

2027 వన్డే ప్రపంచకప్: 14 జట్లు, 3 దశలు
2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ టోర్నీని మూడు విభిన్న దశల్లో నిర్వహించనున్నారు. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన జట్లతో తలపడాల్సి ఉంటుంది. అనంతరం రెండు గ్రూపుల నుండి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ఆరు జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధిస్తాయి. ఈ సూపర్ సిక్స్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకోగా, అక్కడ విజయం సాధించిన రెండు జట్లు ఫైనల్‌లో టైటిల్ కోసం పోరాడుతాయి. 2003 ప్రపంచకప్ ఫార్మాట్‌ను పోలిన ఈ విధానం ద్వారా టోర్నీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగనుంది.

2028 టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ సరికొత్త ‘సూపర్-10’

మరోవైపు, పొట్టి ఫార్మాట్‌కు ఉన్న ఆదరణను మరింత పెంచేందుకు 2028 టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ సరికొత్త ‘సూపర్-10’ (Super-10) దశను ప్రవేశపెట్టనుంది. గతంలో ఉన్న ‘సూపర్-8’ స్థానంలో దీనిని తీసుకురావడం వల్ల అసోసియేట్ దేశాలకు బలమైన జట్లతో తలపడే మరిన్ని అవకాశాలు లభిస్తాయి. దీని ప్రకారం గ్రూప్ దశ దాటి వచ్చిన అత్యుత్తమ పది జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆయా గ్రూపులలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణకు, చిన్న జట్లలో నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్