బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA World Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్‌

2 గంటల క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 05:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఫిఫా ప్రపంచకప్ 2026లో డల్లాస్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన తొలి సెమీఫైనల్ పోరులో స్పెయిన్ 2-0 తేడాతో బలమైన ఫ్రాన్స్‌ను ఓడించి ఫైనల్‌‌కు చేరకుంది. ఫిఫా చరిత్రలో స్పెయిన్ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది కేవలం రెండో సారి కావడం విశేషం. మ్యాచ్ 21వ నిమిషంలో స్పెయిన్ టీనేజ్ సంచలనం లామైన్ యమల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నె బాక్స్‌లో ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది. ఈ సువర్ణ అవకాశాన్ని స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ మికెల్ ఒయర్జబాల్ అద్భుతమైన గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం సెకెండ్ హాఫ్‌లోనూ అదే జోరును కొనసాగించిన స్పెయిన్, 58వ నిమిషంలో పెడ్రో పోర్రో చేసిన సూపర్ స్ట్రైక్ గోల్‌తో 2-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్