సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా మహాకవి గురజాడ 164వ జయంతి

1 గంట క్రితం

school.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – పెరవలి: తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామలలోని ఇనపకోళ్ల రాఘవరావు మెమోరియల్‌ శాఖా గ్రంథాలయంలో మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం గ్రంథాలయాధికారి ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశంలో మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు రాజ్యమేలుతున్న సమయంలో సమాజంలో మార్పు తీసుకురావడానికి గురజాడ తన రచనల ద్వారా విశేష కృషి చేశారని అన్నారు. ఆయన రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం ఆనాటి సమాజంపై ఎంతో ప్రభావం చూపిందని తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు గురజాడ అభ్యుదయ భావాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అనే గురజాడ సందేశం నేటికీ ప్రజల్లో మారుమోగుతోందని పేర్కొన్నారు. సమాజాభ్యుదయానికి గురజాడ సాహిత్యం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాతూరు వెంకటేశ్వరరావు, నిడదవోలు త్రినాథ్‌, కే. రాధాకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్