శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టార్చ్ ఫిన్‌టెక్ సంస్థతో నన్నయ వర్సిటీ ఎంఒయు...

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 03:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజానగరం

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, ప్రాయోగిక పరిజ్ఞానం అందించడం, ఉన్నత విద్యను ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేయడం లక్ష్యంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, టార్చ్ ఫిన్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్.ప్రసన్నశ్రీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం తరఫున రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి, టార్చ్ ఫిన్‌టెక్ కో-ఫౌండర్ ఎస్. వైభవ్ ఎంఒయు పత్రాలపై సంతకాలు చేసి పరస్పర సహకారానికి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా పరిశ్రమల పనితీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, నూతన ఉపాధి అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించి, సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. సంస్థ సహ వ్యవస్థాపకులు ఎస్.వైభవ్, కె.రవికుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ విద్యార్థులు, నూతన ఆవిష్కర్తల నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునేలా ప్రోత్స హిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు వి.పెర్సిస్, ఆచార్య బి.జగన్మోహన్ రెడ్డి, పి.వెంకటే శ్వరరావు, సంస్థ ప్రతినిధులు రీజినల్ మేనేజర్ బి.విద్యాసాగర్, బ్రాంచ్ మేనేజర్ టి.సాయిరామ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్