శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలయంలో భారీ అన్న సమారాధన

1 గంట క్రితం

Grand community feast (anna samaradhana) at the temple
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 03:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో శనివారం ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. సందర్భంగా చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ ప్రతి శనివారం వివిధ ప్రదేశాల నుంచి స్వామి దర్శనానికి విచ్చేసి యాత్రికుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు శనివారాలు, నాలుగు ప్రదక్షిణలు అనే నినాదం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రబలమవడంతో ఆలయానికి వివిధ ప్రదేశాల నుంచి యాత్రికులు పోటెత్తడంతో గోవింద నామస్మరణతో మారు మ్రోగింది. విచ్చేసిన యాత్రికులకు దేవస్థానం ఆలయ ఈవో నరేంద్ర కుమార్, చైర్మన్ రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేసి దర్శనానికి, అన్న సమారాధనకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్