ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో "లాజిస్టిక్స్ & సప్లై చైన్ మేనేజ్‌మెంట్ - ఆధునిక ధోరణులు & కెరీర్ అవకాశాలు" అంశంపై జాతీయ అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ప్రముఖ పరిశ్రమ నిపుణులు, UID-ఆధార్ డిజిటైజేషన్ ప్రాజెక్ట్ మేనేజర్, గతి శక్తి విశ్వవిద్యాలయం (వడోదర) విజిటింగ్ ఫ్యాకల్టీ జాన్ ప్రశాంత్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ఆధునిక సప్లై చైన్ వ్యూహాలు, లాజిస్టిక్స్ రంగంలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ, ఇ-కామర్స్, వేర్‌హౌసింగ్, డిజిటల్ లాజిస్టిక్స్, కెరీర్ అవకాశాలు, భవిష్యత్తులో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. తరగతి గదిలో నేర్చుకునే థియరీని పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా. R.K. రామచంద్ర మార్గదర్శకత్వంలో, సైన్స్ బ్లాక్ లోని కెరీర్ గైడెన్స్ సెల్ లో ఉదయం 11 నుండి 12 గంటల వరకు జరిగింది. విభాగాధిపతి డా. బి.పి. నర్సారెడ్డి, IQAC కోఆర్డినేటర్ డా. ఏ.ఏ. అన్నపూర్ణ, BBA (లాజిస్టిక్స్) ఇన్‌చార్జ్ శ్రీమతి బి. సుజాత, కామర్స్ లెక్చరర్ డా. పి. సునంద , కామర్స్ & మేనేజ్‌మెంట్ అధ్యాపక బృందం సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
‘లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్’పై ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జాతీయ స్థాయి ఉపన్యాసం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 03:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)