ప్రజాశక్తి – కోరుకొండ : కోరుకొండ పోలీస్ స్టేషన్ పునర్నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం తెలిపారు. కోరుకొండ పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా కూలిపోవడంతో ప్రస్తుతం తాత్కాలికంగా రైతు భరోసా కేంద్రంలో పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కూలిపోయిన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందిని అడిగి స్టేషన్ నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ భవనం కూలిపోవడంతో విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చి, పునర్నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా కృషి చేస్తానని తెలిపారు. పోలీస్ సిబ్బంది, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు కొనసాగిస్తూనే శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కోరుకొండ పోలీస్ స్టేషన్ పునర్నిర్మాణానికి కృషి : ఎమ్మెల్యే బత్తుల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)