ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ కార్యక్రమం బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా లేఖరులు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ను వేలివెన్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఉపాధిపై పడుతున్న ప్రభావాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని శేషారావు హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
మూడవ రోజు నిడదవోలు దస్తావేజు లేఖరుల పెన్ డౌన్
22 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)