సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేలనంటిన వరి చేలు

1 గంట క్రితం

paddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 01:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆందోళనలో అన్నదాతలు

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం: ఇటీవల తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల పరిధిలో వరి చేలు నేలనంటాయి. పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడం పట్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కట్టించి అప్పులు చేసి శ్రమించి పండించిన పంట చేతికందే వేళల్లో వర్షం నీటిలో వరి పంట ముంపుకు గురవడంతో రైతులు దిక్కుతోచని స్థితులో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ తుఫాను ముంపు నుంచి రైతులు తేరిపోక ముందే రెండవ సారి తుఫాన్ నేపథ్యంలో సోమవారం కురిసిన వర్షానికి వరి చేలల్లో నీరు చేరడం, స్థానికులు బయటికు వెళ్లి నిత్యవసరాలు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. పలుచోట్ల పల్లపు ప్రాంతాల్లోకి చేరిన వర్షపు నీరుతో నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్లు పొంగి పొర్లడంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరి ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. అకాల వర్షాలకు పంటలు పాడైపోవడంతో రైతులు దిగాలుచెందుతున్నారు. అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి వస్తుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్