సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి : కమిషనర్ రాహుల్ మీనా

1 గంట క్రితం

meena.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేలా అర్బన్ పరిధిలోని పార్కులను నగరపాలక సంస్థ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం ఉదయం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. గాంధీపురంలోని స్పోర్ట్స్ పార్క్ లో రూ. 34.83 లక్షలు., సుబ్బారావుపేట పార్కులో రూ.10.23 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధిలో భాగంగా దశల వారీగా పార్కులను అభివృద్ధి చేస్తూ, పిల్లలు, యువత, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వయసుల వారీగా ఉపయోగపడేలా వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. సాధారణ పార్కులకు భిన్నంగా సందర్శకులకు ఆహ్లాదంతో పాటు చిన్నారులకు ఆట పరికరాలు, పెద్దలకు యోగా, ధ్యానం, వ్యాయామం చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వేగంగా విస్తరిస్తున్న నగర జీవనశైలిలో ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు ఇటువంటి పార్కులు ఉపయోగపడతాయన్నారు. పర్యటనలో ఎస్ఈ రీటా, ఈఈ మాధవి, ఏఈ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్