ప్రజాశక్తి - మండపేట : ఇటీవల రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన క్యాట్ లెవెల్–1 ఒలింపియాడ్ పోటీ పరీక్షలో మండలంలోని తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన సి బ్యాచ్, ఐకాన్ విద్యార్థులు మొత్తం 151 మంది రెండవ దశ పోటీ పరీక్షకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ జి. లక్ష్మీనారాయణ తెలిపారు. కెమిస్ట్రీలో 55 మంది, మ్యాథమెటిక్స్ లో 48 మంది, ఫిజిక్స్ లో 48 మంది విద్యార్థులు రెండవ దశకు అర్హత సాధించారని తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఈ విజయాన్ని సాధించడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. నవంబర్ 28వ తేదీన రెండవ దశ పోటీ పరీక్ష నిర్వహించనున్నట్లు రీజినల్ ఇన్‌చార్జి ఎం.వి.ఎల్ నరేష్ తెలిపారు. తమ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎం.వి సురేష్ పేర్కొన్నారు.
క్యాట్ ఒలింపియాడ్‌లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)