సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఊనగట్ల విద్యార్థినిలు ఎంపిక

5 గంటల క్రితం

Students from Unagatla selected for state level volleyball competitions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఊనగట్ల విద్యార్థినిలు ఎంపికయ్యారు. చాగల్లు మండలం ఉన్న గట్ల  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధినులు నారాయణపురం లో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ 14 బాలికల విభాగంలో ఇద్దరు తొర్లపాటి శశి ధరణి, కంచర్ల హని వారిద్దరూ ఈనెల 11 నుండి 13 వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలులో పాల్గొననున్నారు. అండర్ 17 బాలికల విభాగంలో పంతకాని.లాస్య  ఈనెల  13 నుండి 15 వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేదునూరు అయినవల్లి మండలంలో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని పాఠశాల  ప్రధానోపాధ్యాయులు  ఎన్ వి రమణ సోమవారం తెలిపారు. వారికి కోచింగ్ ఇచ్చిన వ్యాయామో పాధ్యాయులు కొయ్య గంగాధర రావు ఆ విద్యార్థుల్ని అభినందించారు. వారిని పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు. నందిగం శ్రీనివాసరావు  సొసైటీ అధ్యక్షులు బొల్లిన శివ నాగేంద్ర  ఎస్ఎంసి చైర్మన్ దొంగ ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, గ్రామ పెద్దలు ఆ విద్యార్థులను అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్