బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన అవసరం

22 ఆగస్టు, 2026

police.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 01:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • న్యాయమూర్తి ఎన్ రెడ్డి ప్రసన్న, ధవలేశ్వరం ఎస్సై హరిబాబు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : మహిళలు, చిన్నారులకు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్, ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఆఫ్ జువెనల్ జస్టిస్ బోర్డ్, రాజమహేంద్రవరం మెజిస్ట్రేట్ ఎన్. రెడ్డి ప్రసన్న, ధవలేశ్వరం ఎస్సై బి. హరిబాబు తెలిపారు. కలెక్టరేట్ వెనక గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాలలో బాలికలకు బాలల చట్టాలు, పోక్సో యాక్ట్, ఇతర చట్టాలుపై అవగాహన, చదువుకునే దశలో పిల్లలు పాటించవలసిన నియమాలు, అపరిచిత వ్యక్తులతో పిల్లలు ప్రవర్తించవలసిన తీరు, ఈవ్‌టీజింగ్, గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహనతో పాటు పీర్ ప్రెజర్‌కు లోనుకాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చిన్నారుల భద్రత, వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం వంటి పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకురావాలని, విద్య మరియు భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, చిన్నారులు సురక్షితంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని ధవలేశ్వరం ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, శక్తి టీమ్ సిబ్బందితో పాటు సుమారు మూడు వందల మంది విద్యార్థినులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్