- డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. క్రేన్ సహాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలింపు
ప్రజాశక్తి – కోరుకొండ : కోరుకొండ సింహద్వారం వద్ద బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి నుంచి కోరుకొండకు పాలు తీసుకొచ్చిన సంగo డైరీ వ్యాన్‌లోని పాలను స్థానికంగా ఓ షాపులో దింపిన అనంతరం గోకవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సింహద్వారం వద్దకు చేరుకునే సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ సంగo డైరీ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డోర్ ఇరుక్కుపోవడంతో డ్రైవర్ భాస్కరరావు సుమారు 30 నిమిషాల పాటు వాహనంలోనే చిక్కుకుపోయారు. ఆయన కుడి చేతికి రెండు చోట్ల, కుడి కాలికి రెండు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. మణికట్టు ఎముక బయటకు వచ్చినట్లు సమాచారం. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సమీపంలోని క్రేన్‌ను రప్పించి, దాని సహాయంతో వ్యాన్ డోర్‌ను తొలగించి డ్రైవర్‌ను బయటకు తీశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన భాస్కరరావును చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని కోరుకొండ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








కామెంట్‌లు (0)