మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కు వేలివెన్ను విద్యార్థులు

30 సెప్టెంబర్, 2026

students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 11:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఉండ్రాజవరం: జిల్లా స్థాయి, అథ్లెటిక్స్ పోటీలో వేలివెన్ను శ్రీ శిరిగిన వెంకన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచి, రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కు ఎంపికైనట్లు హెచ్ ఎంకే లక్ష్మీ గణేష్ బుధవారం తెలిపారు. జిల్లాస్థాయిలో ఇటీవల జరిగిన అండర్ -14 జావలిన్ త్రో లో బంగారు పతకం సాధించిన కె.జయలక్షీ గాయత్రి, వి.యల్.నరసింహా, అండర్ -16 విభాగంలో సిల్వర్ పతకం సాధించిన బి.జయకృష్ణలు కర్నూలులో అక్టోబర్ 2, 3 తేదీలలో జరిగే 41వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని హెచ్ఎం తెలిపారు. విజేతలను ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, గ్రామ పెద్దలు బూరుగుపల్లి శ్రీనివాసరావు, పిడి పి వీరన్న బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయిలో విజేతలు కావాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్