ప్రజాశక్తి - చీరాల: కూలి పనికి వెళ్ళి విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతి చెందిన విషాద ఘటన చీరాల మండలం తోటవారిపాలెం బొమ్మల సెంటర్‌లో బుధవారం చోటుచేసుకుంది. మృతులను చీరాల మండలం వైకుంఠపురంలోని జాలమ్మ గుడి సమీపంలో నివాసం ఉంటున్న కత్తి ఇస్సాకు (22), తిరువిధుల శ్యామ్ (21)లుగా గుర్తించారు. తోటవారిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ నివాసంలో పాలిష్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 04:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)