సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జడ్పీ చైర్మన్ రేసులో మహేశ్వరి దేవి

23 నిమిషాల క్రితం

జడ్పీ చైర్మన్ రేసులో మహేశ్వరి దేవి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కడియం

తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు సునామీ సృష్టించాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 21 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు 20 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ ఘన విజయంతో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోవడం ఖాయమైంది.

ప్రస్తుతం జనరల్‌ మహిళకు రిజర్వ్ అయిన ఈ ప్రతిష్టాత్మక జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి కడియం జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన జనసేన అభ్యర్థిని రత్నం మహేశ్వరి దేవిని వరించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈమె జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రత్నం అయ్యప్ప సతీమణి. కడియం జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన రత్నం మహేశ్వరి దేవి 11,500 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి తన సత్తా చాటారు. ఈమె భర్త నర్సరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రత్నం అయ్యప్పకు జనసేన అధినేతతో నేరుగా ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఇరువురు జనసేన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేతో రత్నం అయ్యప్పకు ఉన్న సన్నిహిత సంబంధాలు మహేశ్వరి దేవికి మరింత ప్లస్ పాయింట్‌గా మారాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎంపికపై త్వరలోనే కూటమి అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూటమి నాయకులు ధీమా వ్యక్తంచేస్తుండగా, కడియం మండలానికి చెందిన పలు పార్టీల నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్