ప్రజాశక్తి - సీతానగరం
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో సీతానగరం మండలం కాటవరం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి విజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పి.లక్ష్మణ్ మాట్లాడుతూ ఇండియన్ రౌండ్ విభాగంలో బి. విక్కీ, అండర్-17 బాలికల విభాగంలో యు.సుచిత్ర, టి. లక్ష్మి విజయం సాధించారు. అలాగే రికర్వ్ విభాగంలో సిహెచ్. ప్రసన్న, ఎన్.చంటిబాబు విజేతలుగా నిలిచారు. కాంపౌండ్ అండర్-14 బాలికల విభాగంలో ఎ. పల్లవి ప్రతిభ కనబరిచి విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన పీడీ ఎం.కుమారిని, ఉపాధ్యాయులను హెచ్ఎంతోపాటు, విద్యార్థులు, గ్రామ పెద్దలు అభినందించారు.







కామెంట్‌లు (0)