ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో టిడిపికి చెందిన మాజీ కార్పొరేటర్ గొందేసి మాధవిలత, ఆమె భర్త హరినాథ్ టిడిపిని వీడి వైసిపిలో చేరారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొందేసి శ్రీనివాసరెడ్డి సమక్షంలో మాధవీలత, హరినాథ్ దంపతులు పలువురు నాయకులు, తమ అనుచరులతో కలిసి వైసిపి కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైసిపి నేతలు వారికి పార్టీలోకి సాదర ఆహ్వానం పలికారు. నియోజకవర్గంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ దంపతులు తమ అనుచరులతో కలిసి వైసీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.







కామెంట్‌లు (0)