ప్రజాశక్తి - యానాం
ఈ నెల 21న యానాంలో నిర్వహించనున్న మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మంగళవారం నిర్వహించారు. స్థానిక ఎస్‌ఆర్‌కె జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు, శారదా విద్యానికేతన్‌లో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. స్థానిక ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ దడాల గొంతయ్య పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈ నెల 21న నిర్వహించే మత్స్యకార దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.







కామెంట్‌లు (0)