మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమిత్ షాను కలిసిన మంత్రి మల్లాడి

2 గంటల క్రితం

అమిత్ షాను కలిసిన మంత్రి మల్లాడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-యానాం

అర్నబ్ తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న యానాం ప్రాంతంలో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.113 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేయాలని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. మంగళవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసి పలు కీలక అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.


తుపాను కారణంగా యానాంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలు తెగిపడటంతో పాటు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. ప్రజల సాధారణ జీవన పరిస్థితులను పునరుద్ధరించేందుకు విద్యుత్ వ్యవస్థల మరమ్మతులు, రహదారుల పునర్నిర్మాణం, ఇతర అత్యవసర పనుల కోసం రూ.113 కోట్ల నిధులను త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.


పుష్కరాలు, పర్యాటక అభివృద్ధికి నిధులు

2027లో యానాంలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వసతి తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.59.80 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. పుష్కరాలకు సమయం సమీపిస్తున్నందున నిధులను సత్వరమే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా, పుదుచ్చేరిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఒక రాష్ట్రం- ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం' పథకం కింద రూ.131 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కోరారు. బీచ్‌ల సుందరీకరణతో పాటు పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అమిత్ షాను మంత్రి మల్లాడి కృష్ణారావు కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్