ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : గత నెల రాజమండ్రిలో జరిగిన జిల్లా స్థాయి జూనియర్ ఫుట్బాల్ ఎంపికలలో జడ్పీహెచ్ఎస్ చాగల్లు విద్యార్థినిలు పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని పిడి. జె విజయలక్ష్మి బుధవారం తెలిపారు. ఎంపికైన వారిలో జి.బేబీ లావణ్య, ఆర్. ప్రవల్లిక. ఎం . మోహిని, ఎం . జి . సంజన శ్రీ, D. కృష్ణ శైలజ, k. సత్య దుర్గ పావని, j. జోష్ణవి, వి . వైష్ణవి,. ఎం . భవాని, జి . సింధు ఉన్నారు. వీరిని ప్రధానోపాధ్యాయురాలు ఎస్. వాసవి , ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు జూలై 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు అనంతపురంలో జరగనున్నాయని విజయలక్ష్మి తెలిపారు.
రాష్ట్ర స్థాయి జూనియర్ ఫుట్బాల్ పోటీలకు జడ్పీహెచ్ఎస్ చాగల్లు విద్యార్థినిలు
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 12:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)