మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకర్నూలులో హైకోర్టు బెంచ్‌ కోరుతూ పిల్‌

56 నిమిషాల క్రితం

kurnool.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇదే వ్యవహారానికి సంబంధించిన ఇతర ప్రజాహిత వ్యాజ్యాలతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎపి పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 313 ప్రకారం కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసేలా కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అనంతపురం పట్టణానికి చెందిన న్యాయవాది జె నారాయణస్వామి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ విచారణకు రాగా, పార్టీ ఇన్‌ పర్సన్‌ నారాయణస్వామి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని శాసనసభలో తీర్మానం ఆమోదించారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్