ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : వెళ్ళమిల్లి పంచాయతీ వీరభద్ర కర్ర చెరువు గట్టు రోడ్డున ఇసుక లారీ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఉంగుటూరు మండలం ఉప్పాకపాడుకి చెందిన వెంకయ్య (70) బైక్ పై వెంకటరామన్న గూడెంకు వెళ్లారు. తిరిగి వస్తుండగా చెరువు గట్టు రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని గూడెం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు.
ఇసుక లారీ ఢీకొని వృద్ధుడు మృతి
07 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 01:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)